WorldWonders

106 ఏళ్ల బామ్మ రన్నింగ్ రేస్‌లో స్వర్ణం సాధించింది

106 ఏళ్ల  బామ్మ రన్నింగ్ రేస్‌లో  స్వర్ణం సాధించింది

నడవడమే కాదు, కూర్చొని కాళ్లుచేతులు కదపడమే కష్టం అనుకునే 100 ఏళ్ల వయసులో ఓ బామ్మ.. వంద మీటర్ల పందెంలో పాల్గొని బహుమతి సాధించింది. హరియాణాలోని చార్కి దాద్రికి చెందిన రమాబాయి అనే 106 ఏళ్ల బామ్మ.. ఉత్తరాఖండ్‌ దేహ్రాదూన్‌లో ఇటీవల జరిగిన క్రీడల పోటీల్లో పాల్గొని ఏకంగా స్వర్ణ పతకం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగు పందెంలో ఈ బంగారు పతకం సాధించింది. పరుగు పందెంతో పాటు షాట్‌పుట్‌ పోటీల్లో సైతం పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యువరాణి మహేంద్ర కుమారి జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో దాదాపు 800 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. హరియాణాకు చెందిన 74 ఏళ్ల జైసింగ్‌ మాలిక్‌, అతడి భార్య 70 ఏళ్ల రమార్తి దేవి 3 కిలోమీటర్ల నడక పోటీలో బంగారు పతకాలు సాధించారు.