WorldWonders

ఈ వ్యక్తి ఎయిర్‌లైన్ పాస్‌తో 37 మిలియన్ కి.మీ ప్రయాణించి.. 100 దేశాలు సందర్శించాడు

ఈ వ్యక్తి ఎయిర్‌లైన్ పాస్‌తో 37 మిలియన్ కి.మీ ప్రయాణించి.. 100  దేశాలు సందర్శించాడు

కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అతన్ని ఎల్లలు లేకుండా ప్రపంచదేశాల్లో ప్రయాణించేలా చేసింది. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ 1990లో ఓ ఆఫర్‌ ప్రకటించింది. విమాన పాస్‌ను కొంటే జీవితాంతం తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. దీంతో న్యూజెర్సీకి చెందిన టామ్‌ స్టకర్‌ (69) దాన్ని కొనుగోలు చేశాడు. అందుకోసం ఆయన 2.9 లక్షల డాలర్లను చెల్లించాడు. ఆ టికెట్‌ కొనుగోలు చేసింది మొదలు.. ఇప్పటిదాకా టామ్‌ స్టకర్‌ 3.7 కోట్ల కి.మీల మేర విమాన ప్రయాణం చేశాడంటే ఆశ్చర్యం కలగకమానదు. అలా ఇప్పటివరకు 100 దేశాలు సందర్శించాడు. ఈ ప్రయాణాల కోసం టికెట్‌ కొనాల్సి వస్తే 24 లక్షల డాలర్లు ఖర్చయ్యేదట. సుదీర్ఘ ప్రయాణాలు చేయడం ద్వారా వచ్చే పాయింట్లు, గిఫ్టు కార్డుల ద్వారా ఆదాయమూ వచ్చేది. ఇలా వచ్చిన దాంతో టామ్‌ స్టకర్‌ తన భార్యతో 120 సార్లు హనీమూన్‌ వెళ్లినట్లు చెప్పాడు.