Food

రొమాంటిక్ భావాలు కలుగుతాయని…మొసలి కాలితో వంటకం

రొమాంటిక్ భావాలు కలుగుతాయని…మొసలి కాలితో వంటకం

తైవాన్‌కు చెందిన విచ్‌ క్యాట్‌ అనే రెస్టారెంటోడికి కూడా ఓ మొసలి ఇలాగే కనిపించినట్లుంది. పైగా అక్కడి చెఫ్‌లకు క్రియేటివిటీ కూడా కాసింత ఎక్కువేనట. అందుకే ఎప్పుడూ చికెన్‌ లెగ్గుపీసులేనా.. మనిసన్నాక కూసింత కళాపోసన ఉండాలని చెప్పి.. మొసలి లెగ్గు పీసుతో ఇదిగో ఈ వంటకాన్ని సిద్ధం చేసేశారు. దీన్ని రుచి చూస్తే. రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ వస్తాయట. అయితే.. రెస్టారెంట్‌కు వచ్చినోళ్లంతా.. ఫొటోలు తీసుకుంటున్నారు తప్పిస్తే.. దీన్ని ట్రై చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. మరి.. ఆ ధైర్యం మీకుందా?