ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) 2023 మహాసభలు శుక్రవారం సాయంత్రం డల్లాస్‌లోని కే బెయిలీ కన్వెన్షన్ సెంటరులో భారీ ఏర్పాట్ల నడుమ బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా నలుమూలల నుండే గాక భారతదేశం నుండి వచ్చిన అతిథులతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. 4000 మందికి పైగా అతిథులు ఈ విందు వేడుకలో పాల్గొని సందడి చేశారు. అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవ వారాంతం కావడంతో ప్రవాసాంధ్రులు ఈ వేడుకకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నాటా అధ్యక్షుడు డా.కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, కన్వీనర్ ఎన్.ఎం.ఎస్.రెడ్డిలు ఏర్పాట్లను సమన్వయపరిచారు. విందు ప్రాంగణ అలంకరణ శోభాయమానంగా తీర్చిదిద్దారు.
* వైవిధ్యంగా నాటా సభలు
నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ప్రసంగిస్తూ తమను వెన్నంటి నడిపిస్తున్న డా.ప్రేమ్ సాగర్ రెడ్డికి, విరాళాలు అందజేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజుల కార్యక్రమాలు వైవిధ్యభరితంగ ఉండేలా రూపకల్పన చేశామని ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో తరలిరావడం సంతోషంగా ఉందన్నారు.
* అతిథులు వీరే
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వైకాపా సోషల్ మీడియా నుండి సజ్జల భార్గవరెడ్డి, తెలంగాణా వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దర్శకుడు RGV, ఆలీ, లయ, అనంతశ్రీరామ్, చిన్నా వాసుదేవరెడ్డి, ఎస్.పీ.శైలజలు హాజరయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీత విభావరి అలరించింది.
* పురస్కార విజేతలు
నాటా 2023 మహాసభల్లో పలు రంగాల్లొ సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు అందజేశారు. పురస్కార గ్రహీతల్లో గట్టు జగదీశ్వర్, డా.ఎస్.వీ.రామారావు, డా.ఖాదర్ వలి, బాలా ఇందుర్తి, డా.యు.నరసిమ్హారెడ్డి, త్రివిక్రమరెడ్డి, డా.పైడిపర్తి జగన్మోహనరావు, అప్పిరెడ్డి హరనాథరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, చిల్లర శ్రీధర్, నరాల రామిరెడ్డి, కొండా వేణుగోపాలరెడ్డి, డా.గంగిరెడ్డి రామసుబ్బారెడ్డి, మరీదు మాధవీలత, పుచ్చలపల్లి వెంకట సత్య, ఆవుల ఈష, సాయితేజరెడ్డి తదితరులు ఉన్నారు.
బ్యాంక్వెట్ విందుకు హాజరయిన వారిలో నాటా వ్యవస్థాపకుడు డా.ప్రేమ్‌సాగర రెడ్డి, తానా నుండి కొల్లా అశోక్‌బాబు, పోలవరపు శ్రీకాంత్, డా. తోటకూర ప్రసాద్, దిలీప్ చండ్ర, తాళ్లూరి జయశేఖర్, యార్లగడ్డ వెంకటరమణ, గారపాటి ప్రసాద్, ముత్యాల పద్మశ్రీ, నాట్స్ నుండి బాపు నూతి, రాజేంద్ర మాదాల, కంచర్ల కిషోర్, ఆటా నుండి మధు బొమ్మినేని, శారద సింగిరెడ్డి, పరమేష్ భీంరెడ్డి, కొండా రామ్మోహన్, GTA నుండి కలవాల విశ్వేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, వంగూరి చిట్టెన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రవాస యువతీయువకుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అతిథులకు పలురకాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.
TNI ప్రత్యేకం – నాటా విందు జనప్రభంజన కనువిందు
Related tags :