మన ఊరు మన వాళ్లు స్పూర్తితో అమెరికాలోని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చెలప్పాలెం గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు శుక్ర, శనివారాల్లో న్యూజెర్సీ రాష్టంలోని ప్రిన్స్‌టన్‌లో కలుసుకున్నారు. అమెరికావ్యాప్తంగా ఉన్న చెలప్పాలెం గ్రామసభ్యులు తమ కుటుంబాలతో తరలివచ్చారు. భావితరాలకు తమ గ్రామ మూలాలను తెలియజేయడం, గ్రామాభ్వృద్ధికి తోడ్పడటం, తమ ఉన్నతికి జీవితాంతము శ్రమించిన పెద్దలను స్మరించుకోవడం, ఒకరికికొకరు అండదండగా కలసిమెలసి ఉండాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
న్యూజెర్సీలో ప్రకాశం జిల్లా చెలప్పాలెం గ్రామ ప్రవాసుల సమావేశం
Related tags :