DailyDose

ప్రపంచంలోనే పెద్ద టైర్ల శ్మశానం

ప్రపంచంలోనే పెద్ద టైర్ల శ్మశానం

ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏడాది 150 కోట్ల వాడేసిన టైర్లను పారేస్తుంటారు. అంటే నిముషానికి 2,850 వాహనాల టైర్లు పాడవుతుంటాయి. గత 20 ఏళ్లగా ప్రపంచంలోని వాడి పారేసిన టైర్లలన్నిటిని డంపింగ్ యార్డ్ లో పడేస్తున్నారు. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న వాడి పారేసిన టైర్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంతకి ఆ ప్రదేశం ఎక్కడ ఉందంటే.. గల్ఫ్ దేశాల్లోని ఒకటైన కువైట్లో ఉంది. ఇక్కడే పాడైపోయిన టైర్లను గుట్టలు గుట్టలుగా పడేస్తుంటారు. ఒక మాములు టైరు 30,000 వేల కి.మీ వరకు పని చేస్తుంది. ఆ తర్వాత అది పాడైపోతుంది.. మనం వేటినైన రీసైకిల్ చేయవచ్చు గానీ .. టైర్లను మాత్రం కరగపెట్టలేము.. ఒక వేళ కరగపెట్టాలని చూసిన పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రదేశాన్ని టైర్ల శ్మశానంగా పిలుస్తుంటారు.