చిన్న పిల్లలకు హెయిర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరో ఒకళ్లు వాళ్లని కదలకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవాల్సిందే. ఓ పక్క వాళ్ల ఏడుపులు, పెడబొబ్బలు..మరోవైపు ఎంతలా పట్టకున్నా కదలిపోతూనే ఉంటారు. దీంతో గాయాలు వారికి, హైరానా పడటం మన వంతు అవుతుంది. హెయిర్ కట్టింగ్ షాపులోనూ లేదా మన ఇంటి దగ్గరైన అంతే పరిస్థితి. అలాంటి సమయంలో ఈ అమ్మ తన చిన్నారికి హెయిర్ కట్టింగ్ చేసిన ట్రిక్‌ని ఫాలో అయ్యితే చాలు. ఆ తల్లి మాత్రం భలే మంచి టెక్నిక్ కనుక్కుంది. చూస్తే కచ్చితంగా వాట్ యాన్ ఐడియా! అని నోరెళ్లెబెట్టకుండా ఉండరు. వివరాల్లోకెళ్తే..ఆమె తన చిన్నారికి హెయిర్ కట్టింగ్ చేసేందుకు ఓ అట్ట ప్యాకింగ్ బాక్స్‌ని తీసుకుంది. ముందు ఆ బాక్స్‌లో తన చిన్నారి కదలకుండా కూర్చొనేలా వాటికి రెండు హోల్స్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆ చిన్నారిని ప్యాకింగ్ బాక్స్‌లో ఆ రెండు హోల్స్‌లోకి రెండు కాళ్లు వచ్చేలా ఉంచి కూర్చొబెట్టింది. ఆ తర్వాత తల మాత్రం బయటకు ఉండేలా..చిన్నారి బాడీ, చేతులు కదలకుండా బాక్స్‌ని టేప్‌తో ప్లాస్టర్ వేసేసింది. ఆ తర్వాత ట్రిమ్మింగ్ మిషన్‌తో చక్కగా పిల్లాడికి హెయిర్ కట్ చేసేసింది. ఆ తల్లి ఆలోచనకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదా!. కాగా, అందుకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.