Agriculture

కిలో టమాటా ధర ఎంతంటే?

కిలో టమాటా ధర ఎంతంటే?

వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరల్లో అత్యంత ముఖ్యమైన టమాటా రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నిన్నటి వరకు రూ. 100 పలికిన కేజీ టమాట గురువారం నాటికి రూ. 124 కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌ ఏ గ్రేడ్ టమాట రేటు రూ. 124, బీ గ్రేడ్ రూ. 105 గా అమ్ముడుపోతుంది. కాగా, ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే గురువారం 750 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అక్కడి ప్రజలు టమాటాలను కొనాలంటేనే భయపడిపోతున్నారు.