Business

ఇంటర్నెట్​ వాడకంలో ఏపీ మొదటి స్థానం

ఇంటర్నెట్​ వాడకంలో  ఏపీ మొదటి స్థానం

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. గత నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇంటర్నెట్‌ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్‌ వినియోగం, ఇంటర్నెట్‌ సబ్‌్రస్కిప్షన్‌లలో దేశం­లో అన్ని రాష్ట్రాలను మించిపోయింది. ఈ విష­యాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2022–23 సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగతి నివేదిక వెల్లడించింది.దేశం మొత్తం ప్రతి వంద మంది జనాభాకు 59.97 ఇంటర్నెట్‌ సుబ్స్క్రిప్షన్ ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రా­ష్ట్రంలో ప్రతీ వంద మంది జనాభాకు 120.33 ఇంటర్నెట్‌ సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశ సగటు, ఇతర రాష్ట్రాలకంటే ఎక్కు­వగా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ వినియోగం ఉన్నట్లు నివే­దిక తెలిపింది.  దేశం మొత్తం 2018–19లో ప్రతి వంద మందికి 47.94 ఇంటర్నెట్‌ సబ్‌్రస్కిప్షన్‌లు ఉండగా ఇప్పు­డు 59.97కు పెరిగాయి.

రాష్ట్రంలో 2018–19లో ప్రతి వంద మందికి 94.59 సుబ్స్క్రిప్షన్ లు  ఉండగా 2022–23 నాటికి 120.33 సుబ్స్క్రిప్షన్ లుకు పెరగడం గమనార్హం. మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద సంఖ్యలో సుబ్స్క్రిప్షన్ లు  లేవు. ఆంధ్రప్రదేశ్‌ తరువాత కేరళలో అత్యధికంగా సుబ్స్క్రిప్షన్ లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కేరళలో ప్రతి  వంద మందికి 87.50 సుబ్స్క్రిప్షన్ లు  ఉన్నాయి. ఆ తరువా­త పంజాబ్‌లో 85.97 సబ్‌్రస్కిప్షన్లు ఉన్నాయి.పశ్చిమబెంగాల్‌లో అత్యల్పంగా 41.26 సుబ్స్క్రిప్షన్ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 2019–20 నుంచి ఇంటర్నెట్‌ సబ్‌్రస్కిప్షన్‌లు పెరుగుతూనే ఉన్నాయి. 2021–22లో అంతకు ముందు సంవత్సరానికన్నా కొంత మేర తగ్గినప్పటికీ మరుసటి ఏడాది పెరిగాయి.