WorldWonders

యాపిల్ ఆల్ టైమ్ ఐఫోన్ ఆదాయ రికార్డును నెలకొల్పింది

యాపిల్ ఆల్ టైమ్ ఐఫోన్ ఆదాయ రికార్డును నెలకొల్పింది

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌.. మరో ఘనతను సాధించింది. 3 ట్రిలియన్ డాలర్ల విలువతో ట్రేడింగ్‌ డేను ముగించిన తొలి పబ్లిక్ కంపెనీగా యాపిల్‌ అవతరించింది. శుక్రవారం యాపిల్‌ షేర్లు 2.3 శాతం పెరగగా.. ఆ సంస్థ మార్కెట్ విలువ 3.04 ట్రిలియన్ల డాలర్లకు చేరింది.

Apple market value 3 trillion : 2022 జనవరిలోనూ.. వరసగా రెండు రోజులు యాపిల్‌ సంస్థ 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్ ముగిసే సరికి ఆ విలువను కొనసాగించలేకపోయింది. టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ 2.53 ట్రిలియన్లతో రెండో అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా ఉంది. చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో 2.08 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ విలువతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

యాపిల్​ సంస్థను 1976 ఏప్రిల్ 1న స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్, రొనాల్డ్ వేన్ కలిసి స్థాపించారు. 3 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరేందుకు ఆ సంస్థకు 47 సంవత్సరాలు పట్టింది.1985లో యాపిల్​కు స్టీవ్ జాబ్స్ దూరం కావాల్సి వచ్చింది. అయితే.. 1997 నాటికి ఆ సంస్థ దివాలా అంచున ఉండగా.. స్టీవ్ జాబ్స్ తిరిగొచ్చారు. ఆ తర్వాత యాపిల్ వృద్ధి బాటలో పరుగులు తీసింది.2021 ఆగస్టులో తొలిసారి యాపిల్ 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే 3 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.యాపిల్ ఆదాయంలో సింహభాగం ఐఫోన్ ద్వారా వస్తోంది. గతేడాది ఆ సంస్థ సేల్స్ విభాగంలో 400 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించగా.. అందులో సగానికిపైగా ఐఫోన్ల విక్రయం ద్వారా వచ్చిందే కావడం విశేషం.మదుపర్లకు ఏడాదికి 105 బిలియన్ డాలర్ల డివిడెండ్ చెల్లించి, షేర్లను తిరిగి కొనేసినా.. గత త్రైమాసికంలో 56 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు యాపిల్ దగ్గర ఉన్నాయి.జిల్లో సంస్థ అంచనాల ప్రకారం 3 ట్రిలియన్ డాలర్లతో… అమెరికాలో దాదాపు 90 లక్షల ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. అమెరికన్లు అందరికీ… 3 ట్రిలియన్ డాలర్లను సమానంగా పంచితే ఒక్కొక్కరికీ 9 వేల డాలర్లు అందుతాయి.