Fashion

చాక్లెట్ చిప్ కుకీ చెవిపోగులు

చాక్లెట్ చిప్ కుకీ చెవిపోగులు

కుకీలంటే ఇష్టముంటే మీరేం చేస్తారు? ‘కనిపించగానే చటుక్కున నోట్లో వేసుకుంటాం’.. అని చెబుతారు కుకీ ప్రియులు. కానీ కొంతమంది మాత్రం, ఓ అడుగు ముందుకేసి వాటి మీద ఇష్టాన్ని వైవిధ్యంగా చూపుతున్నారు. తాము ప్రేమించే చాకొలెట్‌ చిప్‌ కుకీలను లోలాకులుగా, లాకెట్లుగా పెట్టుకుంటున్నారు.వాటిపట్ల ఇష్టాన్ని నలుగురికీ కనిపించేలా చాటి చెబుతున్నారు. జువెలరీ క్లేను ఉపయోగించి అచ్చంగా చేతితో తయారు చేస్తారు వీటిని. నిజమైన కుకీని పోలినట్టు రియలిస్టిక్‌గా కనిపించడం ‘చాక్లెట్‌ కుకీ జువెలరీ’ ప్రత్యేకత. అదన్న మాట సంగతి. అర్థమైందిగా, ఇక ఎవరైనా వీటిని పెట్టుకుంటే కొరుక్కుతినేలా చూడకండేం!