నాటా 2023 మహాసభల రెండోరోజు సాయంకాల భోజనాల వద్ద భారీ రద్దీ నెలకొంది. 5గం నుండీ 6గం వరకు భోజనాల సమయంగా ప్రకటించిన నిర్వాహకులు 6గం వరకు తలుపులు తీయకపోవడంతో సభాప్రాంగణం వద్ద భారీ రద్దీ నెలకొంది. 45నిముషాలకు పైగా అతిథులు ఎదురుచూడవల్సిన పరిస్థితి ఏర్పడింది. 6గం తర్వాత నిర్వాహకులు తగిన ఏర్పాట్లతో అతిథులను లోనికి అనుమతించారు. చిన్నారులు, వయోవృద్ధులు చాలాసేపు వేచి ఉండాల్సి రావడం పట్ల భోజనాల వద్ద అసౌకర్యానికి అతిథులు అసహనం వెలిబుచ్చారు.
నాటా Day2 Evening: భోజనానికి బారులు
Related tags :