తనకు ప్రపంచకప్ కన్నా శృంగారం అంటేనే ఎక్కువ ఇష్టమని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. నాటా 2023 సభల్లో సాయంకాల సమావేశాల్లో భాగంగా RGVతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న ఆయన ప్రవాస అతిథులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. యోగా అంటే బద్ధకంగా చేసేదిగా ఉంటుందని అందుకే అది ఇష్టం లేదని పేర్కొన్న ఆయన శివ2 సినిమా ప్రస్తుత మార్కెట్కు సరిపోదన్నారు. జగన్ గురించి తాను వై.ఎస్.ఆర్ మరణానికి పూర్వం ఎప్పుడూ వినలేదని పాదయాత్ర అప్పుడు తెలిసిందని, చంద్రబాబు అంటే తనకు వెన్నుపోటూ తప్ప ఏదీ గుర్తురాదని, పవన్ కళ్యాణ్ అంటే దాడులు చేస్తాననే ప్రసంగాలు తప్ప ఏమీ ఉండవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రవాసులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. హాలు మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది.
ప్రపంచకప్ కన్నా శృంగారమే ఇష్టం-నాటా సభల్లో RGV
Related tags :