సాంస్కృతిక వికాసమే నాటా మాట – సమాజ సేవయే నాటా బాట అనే నినాదంతో నాటా 2023 మహాసభలు నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు డా.కొర్సపాటి శ్రీధరరెడ్డి నాటా సభల రెండోరోజు ప్రారంభ వేడుకలో ప్రసంగిస్తూ అన్నారు. స్థానిక చిన్నారుల స్వాగత నృత్యంతో ప్రారంభమైన ఈ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ప్రసంగించారు. వేడుకల విజయవంతానికి కృషి చేసిన వారికి శ్రీధరరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే రెండు రోజుల కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉంటాయని తెలిపారు. నాటా ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు. రెండో రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ రవిశంకర్ హాజరయ్యారు.
ఈ రెండో రోజు ప్రారంభోత్సవంలో డా.ప్రేం సాగరరెడ్డి, డా.పైళ్ల మల్లారెడ్డి, కన్వీనర్ ఎన్.ఎం.ఎస్.రెడ్డి, తదుపరి అధ్యక్షుడు హరి వెల్కూర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భాస్కరరెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రూపొందించిన సావనీర్‌ను విడుదల చేశారు. డల్లాస్ మేయర్ పంపిన సందేశాన్ని ఈ వేడుకల్లో చదివి వినిపించారు.