DailyDose

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ-TNI నేటి తాజా వార్తలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ-TNI నేటి తాజా వార్తలు

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి(జులై1) మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా తొలి రోజు (జులై1)  అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు.దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు.. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదాన్ని ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు పంపిణీ చేయనున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు క్యూ కాంప్లెక్స్ బయట కూడా వేచి ఉన్నారు. ఆషాఢమాసం కావడంతో గత కొద్ది రోజులుగా తిరుమల భక్తుల రద్దీ తగ్గింది. కానీ శుక్రవారం( జూన్ 30)  భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలొచ్చారు.   ఇక శనివారం ( జులై1)కూడా  తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. నిన్న (జూన్ 30)  శ్రీవారిని 73,572 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న (జూన్ 30)  శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,448 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.శనివారం ( జులై1) శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్యూ లైన్లలో ఉన్నవారికి అన్నపానీయాలు అందిస్తున్నారు.

ఈ నెల 10న ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

TS: రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెల రోజుల వ్యవధితో అప్లై చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు.

షెడ్యూల్‌ వివరాలు:
అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల : 10-7-2023
ప్రవేశాలకు గడువు: 10-8-2023
ఆలస్య రుసుముతో: 11-08-23 నుంచి 31-08-23

జులై 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు రంగం సిద్ధమైంది. పార్లమెంటులో వాడీ వేడి చర్చలకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత 9 ఏళ్లల్లో చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి అధికార బీజేపీ సిద్ధమవుతుండగా.. అదే 9 ఏళ్ల అధికారంలో బీజేపీ చేసిన లోపాలను.. వారు చేస్తామని చేయకుండా ఉన్న పనులను చెప్పి అధికార బీజేపీని బ్లేమ్‌ చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనివర్సస్‌ సివిల్‌ కోడ్‌(యుసీసీ) వంటి పలు కీలక బిల్లులను తీసుకొచ్చే ఆలోచనలో అధికార బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వర్షా కాల పార్లమెంటు సమావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహాంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రధానమైన మంత్రులతో చర్చించారు. అలాగే పార్లమెంటులో ప్రపవేశ పెట్టబోయే బిల్లులపై ఈ నెల 3న జరిగే కేంద్ర కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్‌లో చర్చించి ఆమోదం పొందిన తరువాత 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో బిల్లులను ప్రవేశ పెట్టే అవాకశం ఉన్నట్టు తెలుస్తోంది.

నేడు కాచిగూడ-కాకినాడ స్పెషల్ ట్రైన్

టౌన్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07215 నెంబర్ ప్రత్యేక రైలు ఇవాళ రాత్రి 8.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రేపు ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. మల్కాజ్ గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ

రెండో విడత వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రెండో విడత యాత్రపై దృష్టి సారించారు. ఈ నెల 9న ఏలూరు నుంచి వారాహి యాత్ర పున:ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్‌ను పవన్ కల్యాణ్, పార్టీ నేతలు ఖరారు చేశారు. జులై 6,7,8 తేదీల్లో రాజమండ్రిలో ముఖ్యనేతలతో పవన్ సమీక్షలు నిర్వహించనున్నారు. వారాహి రెండో విడత యాత్రను ఏ తారీకు వరకు కొనసాగించాలి, ఎన్ని సభల్లో ప్రసంగాలి, ర్యూట్ మ్యాప్‌ వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం రెండో విడత ముగింపు తేదీ ప్రకటించనున్నారు. అంతేకాదు యాత్ర సాగే ప్రాంతాలను కూడా ప్రజలకు తెలపనున్నారు.

గూగుల్ మ్యాప్ను నమ్ముకోవడంతో పరీక్ష మిస్!

TS: కొందరు అభ్యర్థులు అలసత్వంతో.. గ్రూప్-4 పరీక్ష రాయలేకపోయారు. తాజాగా చౌటుప్పల్లో ఓ అభ్యర్థి పరీక్ష రాసేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా సెంటరు చేరుకున్నారు. అయితే, ఆ స్కూల్ సెంటర్ను వేరే ప్రదేశానికి నిర్వాహకులు మార్చడంతో.. గూగుల్ మ్యాప్ పాత ప్లేస్ను చూపించింది. అభ్యర్థి తప్పుడు ప్లేసు వెళ్లగా.. మళ్లీ సరైన ప్రాంతానికి చేరుకునేలోపు ఆలస్యం అయింది. దీంతో అతను పరీక్ష రాయలేకపోయాడు.

ఖమ్మం సభలో సమర శంఖం

రేపు ఖమ్మంలో నిర్వహించే భారీ భహిరంగ సభకు రాహుల్ గాంధీ రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన ఖమ్మం సభకు చేరుకోనున్నారు. సభ అనంతరం రోడ్డు మార్గాన తిరిగి గన్నవరానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు.

ఈ నెల 5న పాఠశాలలు బంద్

AP: రాష్ట్రంలో ఈనెల 5(బుధవారం)న పాఠశాలల బంద్కు ABVP పిలుపునిచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నట్లు ABVP ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్ల నియామకం చేపట్టాలంటూ డిమాండ్ చేసింది. ఈనెల 5న చేపట్టే బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

వివేకా కేసులో A-8 నిందితుడిగా అవినాష్

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు చేసిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. హత్యకు డబ్బు సమకూర్చిందెవరో తేలాల్సి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో సీబీఐ కోర్టుకు అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. ఇందులో A-6గా ఉదయ్‌కుమార్‌రెడ్డి, A-7గా వై.ఎస్‌.భాస్కరరెడ్డి, A-8గా వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిలను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్‌లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది.

ఏపీ, తెలంగాణలో ఎన్నికలపై సర్వే

2024 లోక్సభ ఎన్నికలపై టైమ్స్ నౌ నవభారత్ సర్వే నిర్వహించింది. ‘జన్గాన్కామన్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడించింది. వైసీపీ 24–25 ఎంపీ సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఇక తెలంగాణలో BRS పార్టీకి 37% ఓట్లు, కాంగ్రెస్కు 29.20%, BJPకి 25.30% ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇక కేంద్రంలో BJP+ పార్టీలకు 285-325, కాంగ్రెస్ + పార్టీలకు 111-149 సీట్లు వస్తాయంది.