ScienceAndTech

పింక్ వాట్సాప్ ఫై పోలీసులు రెడ్ అలెర్ట్

పింక్ వాట్సాప్ ఫై పోలీసులు రెడ్ అలెర్ట్

 సైబర్ నేరగాళ్లు ప్రజలకు దొచుకునేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. వాట్సాప్ కొత్త వెర్షన్ పింక్ వాట్సప్ డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ ఇటీవల వాట్సాప్ గ్రూప్ లలో ఓ లింక్ చెక్కర్లు కొడుతోంది. ఈ యాప్‌ను వినియోగదారులు సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు లింక్‌ను క్రియేట్ చేశారు. ఒక వేళ ఆ యాప్ ను డౌన్ లోడ్ చేస్తే.. మన బ్యాంకింగ్ వివరాలు, వన్ టైం పాస్‌ వర్డ్‌లు (ఓటీపీలు), ఫోటోలు, కాంటాక్ట్ లతో సహా మన డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి అనర్థాలు జరుగుతాయి.ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌ను పింక్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ వినియోగదారులకు ముంబై పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ‘వాట్సాప్ పింక్ – ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రెడ్ అలర్ట్’, దానితో పాటు పరిణామాలను వివరిస్తూ అలాగే స్కాం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటూ ముంబై పోలీసులు ట్వట్టర్ లో ట్వీట్ చేశారు