NRI-NRT

ప్రవాసుల అనుభవం ఏపీకి అవసరం – నాటా సభలో జగన్ సందేశం

ప్రవాసుల అనుభవం ఏపీకి అవసరం – నాటా సభలో జగన్ సందేశం

ప్రవాసుల మూలాలు గ్రామాల్లోనే గాక మట్టిలో కూడా ఉన్నాయని, అందుకే ప్రతి ప్రాంతానికి చెందిన ప్రవాసులు సమగ్ర రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సందేశమిచ్చారు. నాటా 2023 మహాసభల సందర్భంగా ఆయన పంపిన వీడియో సందేశాన్ని వైకాపా మీడియా & సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవ రెడ్డి చేతుల మీదుగా ఈ వేడుకల్లో ప్రదర్శించారు. జగన్ మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం తాను డల్లాస్ వచ్చానని, వేరే దేశంలో ఉన్నా తెలుగువారందరూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటడం సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. అమెరికాలో పలు రంగాల్లో రాణిస్తున్న ప్రవాసుల అనుభవం ఏపీకి ప్రస్తుతం అవసరమని, వీరి భాగస్వామ్యంతో ఏపీని మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చునని ఆయన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. గ్రామ సచివాలాయాలు, ప్రభుత్వ పాఠాశాలల్లో ఆంగ్ల మాధ్యమ విలువ, ప్రభుత్వ పాఠశాలల్లో డిజితల్ తరగతుల ద్వారా బోధన, ఆహారా ధాన్యాల ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత రంగాలపై ప్రత్యేక దృష్టి, ఇంటర్నెట్ సేవల బలోపేతం, రాష్ట్రంలో వైద్య కళాశాలలు, పోర్టుల నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగించారు.