ScienceAndTech

63 రోజులు తప్పిపోయిన హెలికాప్టర్‌తో నాసా సంబంధాన్ని పునరుద్ధరించింది

63 రోజులు తప్పిపోయిన హెలికాప్టర్‌తో నాసా సంబంధాన్ని పునరుద్ధరించింది

అంగారకుడిపై తప్పిపోయిన ఇన్ జెన్యూటీ హెలీక్యాప్టర్ జాడ చిక్కిందని నాసా వెల్లడించింది. ఏప్రిల్ 26న ఇన్ జెన్యూటీ 52వ ఫ్లయిట్‌ను లాంచ్ చేసిన రెండు నిమిషాల్లోనే ల్యాబొరేటరీతో సంబంధాలను కోల్పోయింది. అయితే 63 రోజుల తర్వాత సంకేతాలు అందాయని తెలిపింది నాసా…. మార్స్‌పై జెజిరో క్రేటర్ ప్రాంతంలో రోవర్, హెలిక్యాప్టర్ పనిచేస్తున్నాయని, అక్కడి కఠినమైన భూభాగంవల్ల వాటితో కమ్యూనికేషన్‌లో అంతరాయం ఏర్పడుతుందని నాసా పరిశోధకులు తెలిపారు.