ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) 2023 మహాసభలు డల్లాస్ నగరంలోని కే బేలీ కన్వెన్షన్ సెంటరులో అశేష జనసందోహం నడుమ కోలాహలంగా విజయవంతంగా ముగిశాయి. ఒక్క ముగింపు రోజైన ఆదివారం నాడే 15వేల పైచిలుకు అతిథులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మూడురోజులకు కలిపి 25వేలకు పైగా అతిథులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నాటా జీవిత సాఫల్య పురస్కారాన్ని సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ వైద్యుడు డా.ప్రేమ్‌సాగర్ రెడ్డికి ప్రస్తుత అధ్యక్షుడు డా.కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అందజేసి ఘనంగా సత్కరించింది.
ముగింపు వేడుకల్లో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సంగీత విభావరి ఉర్రూతలూగించింది. ఈ వేడుకల్లో సినీనటులు తమన్న, డింపుల్ హయతీ, లయ, పూజ తదితరులు సందడి చేశారు. అందాల పోటీల్లో గెలుపొందిన వారిని ప్రకటించి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులను ఈ సందర్భంగా సత్కరించారు. నవీన్ హాస్యనాటిక ఆకట్టుకుంది.
తనకు, తన బృందానికి నాటా ద్వారా సేవ చేసే అవకాశాన్ని కల్పించి ఈ వేడుకలను విజయవంతం చేసిన వారికి అధ్యక్షుడు డా.కొర్సపాటి శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శ్రీధర్ రెడ్డి దంపతులను నాటా కార్యవర్గం సత్కరించింది.
పాతికవేల ప్రజా ప్రభంజనం…నాటా 2023 మహాసభలు
Related tags :