నాటా 2023 మహాసభల మూడోరోజు ఉదయం నాటా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అష్టావధానం ఏర్పాటు చేశారు. శతావధాన శ్యమంతకమణి ఆకెళ్ళ బాలభాను అష్టావధానిగా రక్తి కట్టించారు. పుదూర్ జగదీశ్వరన్ సంచాలకుడిగా వ్యవహరించారు. డా.నరాల రామారెడ్డి అధ్యక్షత వహించారు. డా.యు.నరసింహారెడ్డి, అనంత్ మల్లవరపు తదితరులు సాహిత్య వేదికను సమన్వయపరిచారు. పృచ్ఛకులుగా కూడా మహిళలే ఉండటం ఈ అవధాన కార్యక్రమ ప్రత్యేకతని నిర్వాహకులు తెలిపారు.
నాటా Day3 Morning: రసాత్మకంగా అష్టావధానం
Related tags :