NRI-NRT

నాటా: పసిపాప ఆరోగ్యంపై డా.ప్రేమ్‌సాగర్ రెడ్డి ఆరా

నాటా: పసిపాప ఆరోగ్యంపై డా.ప్రేమ్‌సాగర్ రెడ్డి ఆరా

2023 డల్లాస్ నాటా సభల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టెక్సాస్ రాష్ట్రంలోని McKinney నగరానికి చెందిన నెల్లూరు జిల్లా నిడిగుంటపాలెం ప్రవాసుల కుమార్తెకు గుండె సంబంధ రుగ్మత ఉంది. ప్రతి దశాబ్దానికి ఓసారి ఈ పాపకు గుండె సంబంధ శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు ఒకసారి పాపకు శస్త్రచికిత్స చేశారు. మరోసారి శస్త్రచికిత్స చేయించాల్సిన సమయం దగ్గర పడుతుండటంతో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంకు చెందిన ఆ పాప తాతయ్య, తల్లి ఆదివారం నాడు నాటా సభలకు వచ్చారు. అదే గ్రామానికి చెందిన డా.ప్రేమ్‌సాగర్ రెడ్డిని కలిసి ఆయన సలహా, సూచనను కోరారు. ప్రధాన వేదిక వద్దకు వెళ్తూ నిడిగుంటపాళెం పేరువినగానే ఆగిన ఆయన పాప రిపోర్టులను పరిశీలించి, తన కార్యాలయాన్ని సంప్రదించాలని, తమ ఆసుపత్రి(https://www.primehealthcare.com/about-prime/facts/) ద్వారా అవసరమైన సాయాన్ని తప్పక చేస్తానని హామీనిచ్చారు. సొంత విమానం కలిగి, వేలకోట్ల సామ్రాజ్యానికి CEOగా, అమెరికాలో 45 ఆసుపత్రులకు అధిపతిగా ఉన్నప్పటికీ సొంత గ్రామం నిడిగుంటపాళెం పేరు వినగానే ఠక్కున ఆగి, సమస్యని సావధానంగా విని చేతనైన సాయం చేస్తానని హామీనివ్వడం పట్ల ప్రవాసులు హర్షిస్తున్నారు.