ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జనగర్జన సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడ్నించి హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చారు. హెలిప్యాడ్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ ఎన్నికల హామీలను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా, డయాలసిస్ రోగులకు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని రాహుల్ ప్రకటించారు.చేయూత పథకం ద్వారా అందిస్తాం రూ.4 వేల పెన్షన్ అందిస్తామని ఆయన వెల్లడించారు. పోడు భూములను ఆదివాసులకు ఇస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం చేయూత పథకంపైనే ఉంటుందని అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయిందని, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ బీ టీమ్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందన్నారు. కర్నాటక తరహాలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తామని, తెలంగాణలోనూ కర్నాటక ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్‌ఎస్‌ను పిలవాలని కొని పార్టీలు కోరాయి. బీఆర్‌ఎస్ వస్తే కాంగ్రెస్ హాజరుకాదని స్పష్టంగా చెప్పాం. కాంగ్రెస్‌లోకి వచ్చేవారి కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ ఐడియాలజీ వారితో మాకు సంబంధం లేదు. కేసీఆర్ స్కామ్‌లు మోడీకి తెలిసినా పట్టించుకోవడం లేదు. మేం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించి తీరుతామని రాహుల్ అన్నారు.