Devotional

అమర్ నాథ్ యాత్రకు భద్రత

అమర్ నాథ్ యాత్రకు భద్రత

దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా సాగే అమరనాథ్‌ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూలోని భాగవతి నగర్‌ క్యాంపు నుంచి మొదటి బృందం యాత్రను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు ఆగస్టు 31వ తేదీ వరకూ ఈ యాత్ర కొనసాగనుంది దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా దళాలను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3 వేల8వందల80 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం దర్శనంలో భాగంగా భక్తులు మంచుతో కూడిన శివలింగాన్ని దర్శించుకోనున్నారు. మొత్తంగా 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు రెండు మార్గాల ద్వారా అమర్‌నాథ్‌ గుహకు చేరుకోనున్నారు. మొదటి మార్గంలో వెళ్లేవారు షెహల్గావ్‌ నుంచి పంచతరుణికి వెళ్లి.. అక్కడ నుంచి అమర్‌నాథ్‌ గుహకు చేరుకుంటారు. రెండో మార్గంలో వెళ్లే వారు శ్రీనగర్‌ నుంచి బాల్తాల్‌కు వెళ్లి అక్కడ నుంచి సుమారు 14 కి.మీ పయనించి మంచు లింగాన్ని దర్శించుకుంటారు. అమర్ నాధ్ యాత్రకి ఐటీబీపీ దళాలు భారీ భద్రత కల్పిస్తున్నాయి. ఈ ఏడాది 3 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్‌ యాత్రకు వస్తారని అంచనా వేస్తున్నారు.