కాలేజీ రోజుల్లో తాను చూసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, పాదయాత్ర అనంతరం చూసిన వై.ఎస్‌కు మధ్య చాలా మార్పు వచ్చినట్లు తాను గమనించానని నాటా వ్యవస్థాపకులు డా.ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు. డల్లాస్‌లోని నాటా 2023 మహాసభల్లో డా.వై.ఎస్.ఆర్. జయంతి కార్యక్రమాన్ని మూడోరోజు మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాస్ ఏంజిల్స్ ఆటాకు వై.ఎస్. వచ్చినప్పుడు తాను ఇతను ఏపీకి తదుపరి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పానని, అది నిజమైందని అన్నారు. పాదయాత్ర తర్వాత వై.ఎస్‌కు ప్రజల పట్ల, వారి కష్టాల పట్ల పెరిగిన అవగాహన కారణంగా మనిషిలో ఆశావాహ దృక్పథం, పేదలకు సాయం చేయాలనే సంకల్పం బలపడిందని అన్నారు.
తితిదే ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, డా.వై.ఎస్.ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు రాఘవరెడ్డి గోశాల, ఆళ్ల రామిరెడ్డి, వెంకట్, కడప రత్నాకర్, లకిరెడ్డి హనిమిరెడ్డి తదితరులు పాల్గొని వై.ఎస్ చిత్రపటానికి నివాళి అర్పించారు.
పాదయాత్ర తర్వాత వై.ఎస్‌లో చాలా మార్పు వచ్చింది-డా.ప్రేమ్‌సాగర్ రెడ్డి
Related tags :