Politics

జనాభా లెక్కలు మళ్లీ వాయిదా

జనాభా లెక్కలు మళ్లీ వాయిదా

జనాభా లెక్కల సేకరణ మరోసారి వాయిదా పడింది. కొవిడ్‌, ఇతర కారణాలతో వాయిదా పడ్డ జనగణన ఈ ఏడాదీ జరిగే అవకాశాలు ఏ మాత్రం లేవు. 2021లోనే జరపాల్సిన ఈ ప్రక్రియను 2024-25 సంవత్సరంలో నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మొదటి భాగంలో సాధారణ ఎన్నికలు జరగనుండడంతో వాటి తరువాతనే చేపట్టే అవకాశం ఉంది. జనాభా లెక్కల సేకరణ చేపట్టడానికి ముందు చాలా కసరత్తు జరుగుతుంది. ప్రాంతాల పరిపాలన సరిహద్దులు మార్చకుండా యథాతథంగా ఉంచాలంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జీఐ) ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు గడువును నిర్ణయిస్తారు. సాధారణంగా జనాభా లెక్కలు సేకరణ ప్రాంభించడానికి ఏడాది ముందుగా ఈ ఉత్తర్వులు ఇస్తారు.