‘ఊపిరి’ సినిమాలో కార్తీ తనకు ఇష్టం వచ్చినట్లు రంగులతో పిచ్చి పిచ్చి గీతలు గీస్తాడు. దాన్ని నాగార్జున ప్రకాశ్ రాజ్‌కు చూపిస్తాడు. ఆ పిచ్చి గీతల్లో ఏదో అర్థం ఉందని అనుకుని ప్రకాశ్ రాజ్ దాన్ని లక్ష పెట్టి కొంటాడు. చివరకు కార్తీ గీశాడని తెలిసి బాధపడతాడు. ఇలా వింతగా అనిపించే వాటికి ప్రపంచంలో చాలా వాల్యూ ఉంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. పై ఫొటోలో ఉన్న ఆ బ్యాగు మన కంటికి కూడా సరిగా కనిపించదు. అలాంటి ఆ బ్యాగు ధర అక్షరాలా 51 లక్షల రూపాయలు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సీహెచ్‌ఎఫ్ సంస్థ ఈ బ్యాగును తయారు చేసింది. ఈ బ్యాగు సైజు 0.03 ఇంచులు మాత్రమే. అంటే ఈ బ్యాగును సరిగా చూడాలంటే భూతద్దం కావాల్సిందే. సదరు సంస్థ అతి చిన్న దైన ఈ బ్యాగును వేలానికి పెట్టింది. గత నెల తమ అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వేలాని పెట్టింది. ఈ బ్యాగు సూది బెజ్జంలోంచి బయటకు వస్తుందని, ఉప్పు రవ్వ కంటే చాలా చిన్నది పేర్కొంది.ఈ బ్యాగు ప్రపంచంలోనే అతి చిన్న బ్యాగని తెలిపింది. ఇక, ఈ బ్యాగును త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేశారు. వేలం పాటలో ఈ బ్యాగు ఏకంగా 51 లక్షల రూపాయల ధర పలికింది. ప్రస్తుతం ఈ బ్యాగుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ బ్యాగు ధర తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత చిన్న బ్యాగుకు అంత ధర ఏంట్రా బాబు అని నోరెళ్ల బెడుతున్నారు. మరి, ఈ బ్యాగుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.