తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల శ్రీరామ్ డెట్రాయిట్‌లో పర్యటించారు. ఫార్మింగ్టన్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చేసిన ఉత్తేజకరమైన ప్రసంగం యువతను ఆకట్టుకుంది. ఏపీలో వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పాలన వలన రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని పేర్కొన్న ఆయన వైకాపా నాయకుల అక్రమాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తెలుగుదేశంపార్టీ గెలుపునకు ఎన్నారైలు కృషి చేయాల్సిన సమయం ఇప్పుడేనని అన్నారు. రవి గుళ్ళపల్లి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమ విజయవంతానికి సునీల్ పంట్ర, కిరణ్ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, రాం ప్రసాద్ చిలుకూరి, ఉమ ఓమ్మి, కెనడా నుంచి సుమంత్ సుంకర, అనిల్ లింగమనేని, శ్రీరామ్ కడియాల, కళ్యాణ్, తదితర టీడిపి అభిమానులు ఇందులో పాల్గొన్నారు.
డెట్రాయిట్ తెలుగుతమ్ముళ్లను ఉత్సాహపరిచిన పరిటాల శ్రీరాం
Related tags :