ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఆయన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి మనీష్ సిసోడియా ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్, హైదరాబాద్ బిజినెస్‌మేన్ అభిషేక్ బోయిన్‌పల్లి, మద్యం కంపెనీ ఎం/ఎస్ పెర్నోడ్ రికార్డ్ మేనేజర్ బినోయ్ బాబు బినోయ్‌ల బెయిల్ పిటిషన్‌లను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.