🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 04.07.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (04-07-2023)
ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఐ.టి నిపుణులు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. పెళ్లి సంబంధం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయం లేదా సంపాదనలో మెరుగుదల కనిపిస్తోంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత పడాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (04-07-2023)
ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఒత్తిడికి గురవుతారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. మీ రాబడి చాలావరకు నిలకడగా ఉంటుంది. శుభ కార్యాల మీద బాగా వ్యయం అవుతుంది. ఒకరిద్దరికి సహాయం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (04-07-2023)
ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బకాయిలు, బాకీలు చేతికి అందుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతం అవడం జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అకారణంగా మాటలుపడాల్సి రావొచ్చు. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ పెరగడం, మాట చెల్లుబాటు కావడం వంటివి జరుగుతాయి.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (04-07-2023)
వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి కానీ, కుటుంబ జీవితంలో కొద్దిగా కలతలు రేగే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు ముందుకు దూసుకు వెడతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (04-07-2023)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు మాటలు రానివ్వవద్దు. ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (04-07-2023)
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. ఆదాయానికి, ఖర్చులకు పొంతన ఉండకపోవచ్చు. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు కొంత వరకూ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడడం జరుగుతుంది. విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (04-07-2023)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇష్ట కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి,ఉద్యోగాల్లో వ్యక్తిగత, ఆదాయ అభివృద్ధి కనిపిస్తాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి ఆలోచించడం జరుగుతుంది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (04-07-2023)
వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ పెద్దలలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (04-07-2023)
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సంబంధించి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ సమాచారం అందుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (04-07-2023)
కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితులకు అండగా నిలబడతారు. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (04-07-2023)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన అవసరాలు తీరడమే కాకుండా, ఆర్థిక సమస్యలు కూడా బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (04-07-2023)
ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, దానితో పోటీగా ఖర్చులు కూడా పెరుగుతాయి. శుభ కార్యాల మీదా లేదా దైవ కార్యాల మీదా బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవాభిమానాలకు లోటుండదు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభాలు గడించడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
🦈🦈🦈🦈🦈🦈🦈