ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.30కు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని జనపథ్–1 నివాసానికి చేరుకుంటారు.ఈ పర్యటనలో సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయన వారితో చర్చిస్తారు.