కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్టుపై లోక్‌సభ సచివాలయం మంగళవారం బులెటిన్ విడుదల చేసింది. అవినాశ్ రెడ్డి అరెస్టుపై సీబీఐ సమాచారం ఇస్తూ రాసిన లేఖ సోమవారం తమకు అందినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. లేఖలో సీబీఐ పేర్కొన్న అంశాలను లోక్‌సభ సచివాలయం బులెటిన్‌లో పేర్కొంది. ‘‘జూన్ 3న అవినాశ్‌ను అరెస్టు చేసి వెంటనే రూ.5 లక్షల పూచీకత్తు, 2 ష్యూరిటీలతో విడుదల చేశాం. అరెస్టు చేస్తే వెంటనే బెయిల్ ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే అవినాశ్‌ను విడుదల చేశాం’’ అని లేఖలో సీబీఐ పేర్కొన్నట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది.