నంది అవార్డులు అంటేనే భయం వేస్తుంది అన్నారు ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి. నిజాయితీగా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ చేయమని సీఎం జగన్ తనకి చెప్పారని.. డ్రామా, టీవీ, సినిమా ఈ మూడు రంగాలకు ఒకేసారి సాధ్యం కాదని జగన్ కి చెప్పానని తెలిపారు. పద్య నాటకాలకు ఊపిరి పోయాల్సిన అవసరం ఉందన్నారు పోసాని. అందుకే ముందు నాటక రంగానికి నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.గతంలో ఒక్కొక్కరికి రెండు, మూడు నంది అవార్డులు ఇచ్చారని.. గతంలో అంబికా కృష్ణని చంద్రబాబు తిట్టారని అన్నారు. అంబికా కృష్ణ తనకి స్వేచ్ఛ ఇవ్వలేదని చంద్రబాబుకు చెప్పేశారని అన్నారు. తాము నంది అవార్డులను ఉత్తములు, అర్హులకు మాత్రమే ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఎవరు షూటింగులు చేసినా ఉచితంగా చేసుకోవచ్చని తెలిపారు. స్టూడియోలు కడితే సహకరిస్తామని సీఎం జగన్ చెప్పారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కూడా సహకారం కోసం మాట్లాడతానన్నారు.