ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ యువనేత, ధర్మవరం ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. అమెరికాలోని షికాగోలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత షికాగో చేరుకున్న శ్రీరామ్‌కు ఎన్‌ఆర్‌ఐ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం షికాగో సిటీ తెలుగు ఎన్‌ఆర్‌ఐలతో పాటు పరిటాల, తెదేపా అభిమానుల హర్షాతిరేకాల మధ్య ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ కోఆర్డినేటర్ కోమటి జయరాం, షికాగో తెదేపా నేతలు హేమకానూరు, ఎన్‌ఆర్‌ఐ తెదేపా కమిటీ సభ్యుల ఆధ్వర్యలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షికాగో తెదేపా అధ్యక్షుడు రవి కాకర్ల ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత రవి ఆచంట, అజాద్, కాశి పాతూరి, మదన్ పాములపాటి, శ్రీనివాస్ పెదమల్లు, ఉమ కటికి, చాందినీ దువ్వూరి, రఘు చిలుకూరి, వెంకట్ యలమంచిలి, చిరు గళ్ల, హరీశ్ జమ్ముల, శ్రీనివాస్ ఇంటూరి, శ్రీనివాస్ అట్లూరి, వెంకట్ చిగురుపాటి, మనోజ్ తదితరులు మాట్లాడారు. అనంతరం పరిటాల శ్రీరామ్ ప్రసంగించారు.
ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులు, సంక్షేమ కార్యక్రమాలను పరిటాల శ్రీరామ్ వివరించారు. అనంతరం చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని పేర్కొన్నారు. ఇటీవల తెదేపా ప్రకటించిన మినీ మేనిఫెస్టో.. మహిళా సాధికారత, నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు, రైతులకు వెన్నెముకగా నిలుస్తుందని శ్రీరామ్ చెప్పారు. షికాగో ఎన్‌ఆర్‌ఐ తెదేపా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెదమల్ల్ఉ, సెక్రటరీ వెంకట్ యలమంచిలి, ట్రెజరర్ విజయ్ కోరపాటి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రఘు చిలుకూరి, రీజనల్ కౌన్సిలర్ చిరంజీవి గళ్ల, రవినాయుడు, కృష్ణమోహన్ చిలమకూరు, హను చెరుకూరి, ప్రదీప్ యలవర్తి, సందీప్ ఎల్లంపల్లి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అరాచక పాలన అంతంతోనే అభివృద్ధి: షికాగోలో పరిటాల
Related tags :