పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ సినిమా వస్తే థియేటర్స్ వద్ద పండగే. ఇక రాజకీయాల్లో కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు. పవన్ మీటింగ్ పెడితే లక్షల్లో జనాలు వస్తారు. సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే అభిమానులు సంతోషిస్తారు, ఫాలోయింగ్ మరింత ఎక్కువవుతుంది.పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో సినిమాల గురించి మాత్రం పోస్ట్ చేయరు. కేవలం పాలిటిక్స్, జనసేన పోస్టులు మాత్రమే పోస్ట్ చేస్తారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్ ఇన్స్టాగ్రామ్ లోకి వస్తారు అనే వార్తలు వచ్చాయి. నేడు ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ టీం ఈ అకౌంట్ ని మేనేజ్ చేస్తుంది.
అయితే ఇన్స్టాగ్రామ్ లో కూడా పవన్ జనసేనకు, పాలిటిక్స్ కి సంబంధించిన పోస్టులే చేస్తారని, సినిమాకు సంబంధించినవి మాత్రం చేయకపోవచ్చని సమాచారం. ఈ విషయంలో మాత్రం అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చాడని తెలియగానే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవుతున్నారు. నిమిషం నిమిషంకి పవన్ అకౌంట్ కి ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు.పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఉన్న మ్యాటర్ నే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకున్నారు. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..Jai Hind! అని తన అకౌంట్ లో పెట్టుకున్నారు. ఇంకా ఎటువంటి పోస్టులు చేయలేదు. ఒక్కరోజులో ఎంతమంది ఫాలోవర్స్ ని సంపాదించి రికార్డు కొడతారో పవన్ అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ మొదటి పోస్ట్ ఏం పెడతాడా అని కూడా ఎదురు చూస్తున్నారు అభిమానులు.