ఫిలడెల్ఫియాలో ఈ శుక్ర, శని, ఆదివారాల్లో జరగనున్న తానా 23వ మహాసభలకు అతిథుల రాక ప్రారంభమైంది. ప్రముఖ నేపథ్య గాయని చిత్ర, సినీనటి శ్రీలీలలు మంగళవారం నాడు ఫిలడెల్ఫియా చేరుకున్నారు. చిత్రకు తానా సభల కన్వీనర్ పొట్లూరి రవి, మహిళ ఫొరం ప్రతినిధులు భాను తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. నటి శ్రీలీలకు మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, జగదీష్ ప్రభల తదితరులు స్వాగతం పలికారు. యాంకర్ అనసూయ, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్లు ఈ మధ్యాహ్నానికి ఫిలడెల్ఫియా చేరుకుంటారు. రాజకీయ నాయకులు ఎర్రబెల్లి ఈ ఉదయమే వర్జీనియా చేరుకోగా, ఎంపీ రఘురామరాజు, పరిటాల శ్రీరాంలు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. బుధవారం నాటికి వీరు కూడా ఫిలడెల్ఫియా చేరుకుంటారని సమాచారం.
తానా సభలకు మొదలైన అతిథుల రాక
Related tags :