Politics

ఏపీ బీజేపీ చీఫ్ గా సోమువీర్రాజు తొలగింపు

ఏపీ బీజేపీ చీఫ్ గా సోమువీర్రాజు తొలగింపు

ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు ఫోన్‌ చేసి తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని నడ్డా ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. 1978 నుంచి సోము వీర్రాజు భాజపాలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో 2020 జులై 27న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఏపీ అధ్యక్షుడిని మార్చాలని భాజపా అధినాయకత్వం భావిస్తున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సోము వీర్రాజుపై రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా కేంద్రమంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై భాజపా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏపీలో మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లాలని భాజపా అధినాయకత్వం భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోము వీర్రాజును తప్పించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర భాజపాకు కొత్త అధ్యక్షుడిని సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశముంది.