Agriculture

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది:

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది:

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో త్రాగునీటికి, సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.
ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అని, ఇది ఇరిగేషన్ శాఖకు టెస్టింగ్ టైం అని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో మాదిరిగా ఆలోచిస్తే కుదరదని కెసిఆర్ పేర్కొన్నారు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నామని, త్రాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.