వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో బయోటెక్నాలజీ విధానంలో మరో వరి వంగడాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘వరంగల్ – 1487’గా పిలిచే ఈ సన్న గింజ వంగడం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా వరి రకాలను మర పట్టిస్తే క్వింటాకు 57 నుంచి 62 కేజీల బియ్యం మాత్రమే వస్తున్నాయి. యాసంగి పంటలో సన్న గింజలో నూక శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధి చేసిన వడ్లను మర పట్టిస్తే క్వింటాకు 70 కేజీల బియ్యం వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నూక శాతం కూడా బాగా తక్కువ ఉంటుందని అంటున్నారు.