Politics

ఏపీలో ముందస్తు ఎన్నికలు?-TNI నేటి తాజా వార్తలు

ఏపీలో ముందస్తు ఎన్నికలు?-

* ఏపీలో ముందస్తు ఎన్నికలు?

నిన్న చిత్తూరులో సీఎంసీ హాస్పిటల్ మరియు అమూల్ డైరీ నిర్మాణ ప్రారంభోత్సవం అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు సీఎం జగన్. ఈ ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక విషయాలు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు మరియు విభజన చట్టంలోని అంశాల గురించి సైతం ప్రస్తావించారట. ఇక తాజాగా కాసేపటి క్రితం మోదీతో మాట్లాడిన సీఎం జగన్ కీలక విషయం గురించి మాట్లాడారట… ఏపీలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం గురించి ప్రధానిని సలహా అడిగినట్లు తెలుస్తోంది. ఈ డిసెంబర్ లో తెలంగాణాలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందుకే కేంద్రంలో మోదీ మరియు అమిత్ షా లు తెలంగాణ ఏపీ తో పాటుగా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించాలని ప్రణాళికలు ఉన్నాయట.మరి ఈ విషయంపై ఎన్నికల సంఘం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

* TS హైకోర్టు చీఫ్ ఉజ్జల్ భుయాన్ కు సుప్రీం జడ్జిగా పదోన్నతి!

తెలంగాణ హైకోర్టు చీఫ్ గా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్వీ భట్టికి పదోన్నతి లభించింది. ఈ మేరకు కొలీజియం సుప్రీంకోర్టు జడ్జిలుగా వారిని ప్రతిపాదిస్తూ సిఫార్సులు చేసింది. 2022 జూన్ 28 నుంచి TS హైకోర్టు చీఫ్ జస్టిన్గా భుయాన్ ఉన్నారు. 2023 జూన్ 1 నుంచి కేరళ చీఫ్ జస్టిస్ భట్టి ఉన్నారు.

 జీహెచ్ఎంసీ అధికారులతో కేటీఆర్ సమీక్ష

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం నేప‌థ్యంలో అన్ని ర‌కాలుగా సిద్ధంగా ఉండాల‌ని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదురొనేందుకు సమన్వయంతో పని చేయాలని కేటీఆర్‌ సూచించారు.జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఇటీవ‌ల ప్రారంభించిన వార్డు కార్యాల‌యాల వ్య‌వ‌స్థ‌పై మంత్రి కేటీఆర్ బుధ‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను అధికారుల ద్వారా మంత్రి తెలుసుకున్నారు. ఈ స‌మావేశంలోనే వ‌ర్షాల‌పై కూడా కేటీఆర్ స‌మీక్షించారు.

లోకేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు

కాసేపటి క్రితమే మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందుగా పవన్ గురించి మరియు ఆయన ఇటీవల చేసిన వారాహి యాత్ర గురించి మాట్లాడి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం యువగలం పేరుతో చేస్తున్న పాదయాత్ర గురించి మాట్లాడింది. రోజా లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. లోకేసూ ముందు ఎమ్మెల్యేగా గెలిచి చూపించు… ఆ తర్వాత అధికారంలోకి రావాలి అన్న పగటి కలలు కనవచ్చు అంటూ వ్యాఖ్యలు చేసింది. గతంలో జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ సారైనా సరైన నియోజకవర్గాన్ని ఎంచుకుని పోటీ చెయ్యి లోకేష్ అప్పుడైనా గెలుస్తావో లేదో అంటూ సెటైర్ వేసింది రోజా.

కోమటిరెడ్డికి జాతీయ పదవి

మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. మంగళవారం పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చిన కమలం పార్టీ రాజగోపాల్ రెడ్డిలోని అసంతృప్తిని చల్లార్చేందుకు జాతీయ కార్యవర్గంలో ఆయనను సభ్యుడిగా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కూడా బీజేపీ నాయకత్వం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించిన విషయం తెలిసిందే.అయితే పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి- కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవల చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో నిన్న భేటీ అయ్యారు. అప్పుడు వారిద్దరూ ఏం చర్చించారన్నది తెలియకున్నా, పార్టీ మారే ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నారని మాత్రం ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసి ఆయనలో పార్టీ మార్పు ఆలోచన రాకుండా జాగ్రత్త పడింది.

* హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన: కేటీఆర్‌

వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వారాంతం నుంచి హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.  పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరిన మంత్రి.. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు  ఏర్పాటు చేసుకోవాలని సూచించారు

ముగిసిన  సీఎం ఢిల్లీ టూర్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది.. ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. ప్రధాని మోడీతో దాదాపు 1 గంటా 20 నిమిషాలసేపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన సీఎం. దాదాపు 45 నిమిషాలసేపు హోంమంత్రితో మాట్లాడారు.. ఇక, ప్రధానితో సమావేశం తర్వాత కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటనను ముగించుకుని సీఎం తిరిగి రాష్టానికి బయల్దేరాడు.

రైల్వే మంత్రితో బండి సంజయ్ భేటీ

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బుధవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఈ రోజు న్యూఢిల్లీలోనే ఉన్న బండి సంజయ్.. అశ్వీనీ వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లి ఖాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లేన్‌ను నిర్మించాలని కోరారు. అలాగే ఈ నెల 8న వరంగల్‌లో ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్‌కు సంబంధించి భూమి పూజను ప్రధాని మోదీ చేయనున్న నేపథ్యంలో దాని ఏర్పాట్లపై అశ్వినీ వైష్ణవ్, బండి సంజయ్ చర్చించారు. అనంతరం ఖాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు.

మరోసారి జగన్ ప్రభుత్వమే వస్తుంది

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని.. జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని సినీ నటుడు సుమన్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడమే అందుకు కారణమని చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని.. వైసీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరిగిందని ఆ వర్గాల వారు చెప్తున్నారని తెలిపారు. నవ­రత్న పథకాలను 95 శాతం అమలు చేసి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

అమితాబ్‌ కు కౌంటర్ ఇచ్చిన సుప్రియా సూలే

ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌(Sharad Pawar) వయస్సు గురించి తన సోదరుడు అజిత్ పవార్(Ajit Pawar) చేసిన వ్యాఖ్యలకు సుప్రియా సూలే(Supriya Sule) కౌంటర్ ఇచ్చారు. ఎన్‌సీపీ కార్యవర్గ అధ్యక్షురాలైన ఆమె.. పెద్ద వయస్సువారు కేవలం ఆశీర్వదించడానికేనని ఎలా భావిస్తారని ప్రశ్నించారు.