* లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతుర్ని తండ్రి ఎం చేశాడో తెలుసా ?
కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. తన కూతుర్ని పెండ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన స్నేహితుల ఇండ్లపై దాడి చేశాడు. పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది.
* తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో సెరైకెలా కోర్టు తీర్పు
జార్ఖండ్‌లోని ప్రముఖ తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో సెరైకెలా కోర్టు తీర్పు వెలువరించింది. తబ్రేజ్‌ను కొట్టి చంపిన మొత్తం 10 మంది దోషులకు కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2019లో తబ్రేజ్ అన్సారీని ఈ వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి ఐపిసి సెక్షన్ 304 కింద శిక్ష విధించింది.2019 సంవత్సరంలో జూన్ 18 రాత్రి తబ్రేజ్ అన్సారీ దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సెరైకెలాలోని ఘట్కిడిహ్ గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు అతడిని పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేశారు. అంతేకాకుండా పట్టపగలే తీవ్రంగా కొట్టారు. ఆయన నోరు మెదిపేంత వరకు అక్కడి జనాలు కొడుతూనే ఉన్నారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించగా.. జూన్ 21న అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో తబ్రేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 22 జూన్ 2019 న మరణించాడు.
* భారీగా బంగారం, సిగరెట్లు పట్టివేత:శంషాబాద్ ఎయిర్ పోర్ట్
విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా బంగారం, విదేశీ సిగరెట్లు తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాస్ ఆల్ ఖైమా, కువైట్, షార్జా మూడు దేశాల నుంచి వచ్చిన విమానాలను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ముగ్గురు ప్రయాణికుల వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు.ముగ్గురు ప్రయాణికులు ఒక ప్రయాణికుడు విమానంలోని సీటు వెనకాల, మరో ప్రయాణికుడు బంగారు కడ్డీలను బ్యాగులో, మరో ప్రయాణికుడు లోదుస్తులలో పెట్టుకొని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వారి ముగ్గురి వద్ద రూ. 1.37 కోట్ల విలువ జేసే 2.279 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా నుంచి బ్యాంకాక్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులు విదేశీ సిగరెట్లు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుండగా వారి వద్ద నుంచి రూ. 1.01 కోట్ల విలువ చేసే విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరు మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
* కిలోల కొద్దీ గంజాయి తినేసిన ఎలుకలు
అక్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను ఎలుకలు రక్షించిన ఘటన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టైన్‌గా మారింది. రెండేళ్ల క్రితం గంజాయి విక్రయిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, గంజాయిని స్టోర్‌హౌస్‌లో దాచారు. ఐతే దాచిన 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆధారాలు మాయంకావడంతో ఇద్దరు నిందితులు మంగళవారం నిర్దోషులుగా సులువుగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే.తమిళనాడులోని మెరినీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజగోపాల్, నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు బీచ్ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తూ 2020లో పోలీసులకు పట్టుబడ్డారు. మొత్తం 22 కేజీల గంజాయిని నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై విచారణ జరిపి ఛార్జిషీట్ దాఖలు చేశారు. వారి కేసును మంగళవారం స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కోర్టు సాక్షాధారాలు కోరింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిలో 50 గ్రాములను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపపారు.
* గిరిజనుడిపై మూత్రం పోసిన బీజేపీ నేత అరెస్ట్
గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లాను మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విచారిస్తున్నామని, త్వరలోనే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే చెప్పారు. (urination case) నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి, ఎస్సీ,ఎస్టీ చట్టంలోని సెక్షన్ 294, 504 కింద కేసు నమోదు చేశారు.గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. (MP Police takes custody of accused) రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిని వదిలిపెట్టదని, అతడిని శిక్షించడం అందరికీ గుణపాఠం అని సీఎం చౌహాన్ అన్నారు. జిల్లాలోని కుబ్రి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
* అనకాపల్లిలో విషాదం
బెట్టింగ్.. బెట్టింగ్.. కొందరి జీవితాలను మారిస్తే.. మరికొన్ని జీవితాలు ఆదిలోనే అంతం చేస్తుంది..ఇలాంటివి చట్ట రీత్యా నేరం అయిన కొందరు బెట్టింగ్ రాయులు మాత్రం ఇలాంటివి చేస్తుంటారు.. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ ల వల్ల ఎందరో జీవితాలను కోల్పోయారు.. తాజాగా ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ వల్ల ప్రాణాన్ని కోల్పోయాడు.. బెట్టింగ్ కోసం చేసిన అప్పు వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. చేసిన అప్పు తీర్చలేక.. కుటుంబ పరువు పోతుందన్న మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు.. తనువు చాలించాడు. బెట్టింగ్ భూతానికి అనకాపల్లి జిల్లాలో యువకుడు బలయ్యాడు.అతను చెల్లెలు పెళ్లి కోసం అప్పులు చేసిన యువకుడు.. ఆ అప్పుల నుంచి గట్టెక్కెందుకు బెట్టింగ్ వైపు మారాడు. బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయి అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన 25 ఏళ్ల మణికంఠ సాయికుమార్‌కు ఇద్దరు చెల్లెలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో తోబుట్టునకు వివాహం చేసేందుకు అప్పులు చేశాడు. దాదాపు 3 లక్షల వరకు తీసుకొని పెళ్లి కోసం ఖర్చు చేశాడు. చేసినా అప్పుకు తెర్చే మార్గం లేక… బెట్టింగ్ పై ఆశలు పెట్టుకున్నాడు. బెట్టింగ్‌లో 40 వేల రూపాయలు కోల్పోయాడు.
* ఎదురెదురుగా బైకులు ఢీ
ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం గద్వాల మండల పరిధి వీరాపురం గ్రామ స్టేజి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం వరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరాపురం గ్రామానికి చెందిన వెంకన్న (50) గ్రామ సమీపంలో రాయి పని చేసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా.. గద్వాల నుంచి ఎరువాలు వైపు వెళ్తున్న ధరూర్ మండలం మన్నాపురంకు చెందిన ఆంజనేయులు, గద్వాలకు చెందిన కిష్టన్నలను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందగా, ఆంజనేయులు కిష్టన్నలకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వెంకన్న ఆదోని కి చెందినవాడు కాగా మూడేళ్ల క్రితం వీరాపురం గ్రామంలో స్థిరపడినట్లు సమాచారం.
* పిల్లలపై అతి ప్రేమతో వాహనాలిస్తే ఎం జరుగుతాయో తెలుసా?
హైదరాబాద్ శివారులోని బండ్లగూడ జాగీర్ సమీపంలోని సన్‌సిటీ వద్ద నిన్న జరిగిన రోడ్డుప్రమాదంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ శివారులోని సన్ సిటీ దగ్గర నిన్న జరిగిన ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన అతివేగం.. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన అమాయకులైన తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది అని చెప్పారు. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పిల్లల మీద అతి ప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి అని సజ్జనార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
* నా ప్రాణాలకు ముప్పు ఉంది:బీహార్ మంత్రి
తన ప్రాణాలకు ముప్పు ఉందని బీహార్ రాష్ట్ర సహకారశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని మంత్రి పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘నా ప్రాణాలకు ముప్పు ఉంది. నన్ను చంపే అవకాశం ఉంది. నన్ను చంపాలనుకునే వ్యక్తులు నాకు తెలుసు. నన్ను చంపినందుకు నిందితుడు రూ.11 కోట్ల రివార్డును ప్రకటించాడు’’ అని మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు లేఖ రాశారు.(he might be killed over caste issues) తనను చంపినందుకు రూ.11కోట్ల రివార్డు ప్రకటించారని, కుల సమస్యలతోనే తనను బెదిరిస్తున్నారని మంత్రి చెప్పారు.
* టీమిండియా ప్లేయర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
టీమిండియా మాజీ ప్లేయర్ ప్రవీణ్ కుమార్ గత రాత్రి (మంగళవారం అర్థరాత్రి) మీరట్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. తన కారులో వెళ్తుండగా వేగంగా వస్తున్న క్యాంటర్ బలంగా ఢీకొట్టిందంట. ఆ కారులో మాజీ క్రికెటర్‌తోపాటు ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం నుంచి తండ్రి కోడుకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారంట. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితుడు క్యాంటర్ డ్రైవర్‌ను పట్టుకున్నారంట.ప్రవీణ్ కుమార్ జులై 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనంలో మీరట్‌లోని పాండవ్ నగర్ నుంచి వస్తున్నాడు. ఇదే సమయంలో ఎదురుగా వస్తోన్న క్యాంటర్ ఢీకొట్టడంతో ప్రవీణ్ కుమార్ కారు బాగా డ్యామేజ్ అయిందంట. కాగా, ఈ మాజీ భారత్ క్రికెటర్ ఇల్లు మీరట్ సిటీ బాగ్‌పత్ రోడ్‌లో ఉన్న ముల్తాన్ నగర్‌లో ఉన్న సంగతి తెలిసిందే.