Movies

విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తొలి పోస్ట్

విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తొలి పోస్ట్

మెగా డాటర్ కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసింది. 2020 డిసెంబర్ 9న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఇద్దరి మధ్య అనుబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. పెళ్లైన కొంత కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు.విడాకులపై నిహారిక ఎలా స్పందిస్తుంది? విడాకులకు గల కారణాల గురించి చెపుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె సోషల్ మీడియాలో తొలి పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ విడాకుల గురించి మాత్రం కాదు. తన సినిమాలకు, వెబ్ సిరీస్ లకు అమెరికా నుంచి ప్రమోషన్స్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసింది. విడాకుల గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ… దానిపై నిహారిక స్పందించకపోవడంతో… డైవోర్స్ ని ఆమె లైట్ గా తీసుకుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.