పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడోసారి విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్.. గత కొన్ని గంటల నుంచి వైరల్ అయింది. దీంతో చాలామంది ఏం జరిగిందా అని మాట్లాడుకున్నారు. నేషనల్ వైడ్ గా ఇది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు వీటిపై పవన్ నుంచి క్లారిటీ వచ్చేసింది. అది కూడా ఒక్క ఫొటో పోస్ట్ చేసి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారిపోయింది.ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మొదటి విడత పూర్తయిన సందర్భంగా తన ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే పవన్ కల్యాణ్- అనా లెజినోవా దంపతులు పాల్గొన్నారు. ఆ ఫొటోనే జనసేన ట్వీట్ చేసింది. సినిమాల విషయానికొస్తే.. పవన్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు.