ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని కొన్నాళ్ల క్రితం విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. తాను చేసే సినిమాలతో, తన హెల్త్ బాగోలేదంటూ వైరల్ అవుతూనే ఉంది.ఆరోగ్యం కోలుకున్నాక మళ్ళీ సమంత వరుసగా సినిమాల మీద ఫోకస్ పెట్టింది. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తుంది. అటు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో సిటాడెల్ సిరీస్ చేస్తుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ సమంత తాజాగా తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది.
ఇటీవలే సిటాడెల్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది సమంత. తాజాగా ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. దీంతో ఒక సంవత్సరం వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని ప్రకటించింది సమంత. సమంత నిర్ణయంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. అలాగే తీసుకున్న సినిమాల అడ్వాన్స్ లు కూడా నిర్మాతలకి తిరిగి ఇస్తుండటంతో ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది. సమంత మళ్ళీ సినిమాలు చేయదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల మళ్ళీ తన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయని, పూర్తిగా ఆరోగ్యంపై ఫోకస్ చేసేందుకే సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు సమంత తెలిపింది. ఇక కొత్త సినిమాలు కూడా ఏమి ఒప్పుకోదని సమాచారం. దీంతో సమంత నిర్ణయం అభిమానులను, ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. మరి సోషల్ మీడియాలో అయినా ఎప్పటిలాగే యాక్టివ్ గా ఉంటుందేమో చూడాలి.