WorldWonders

70 ఏళ్ల సాధువు తన గడ్డంతో అద్భుతమైన విన్యాసం

70 ఏళ్ల సాధువు తన గడ్డంతో అద్భుతమైన విన్యాసం

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌కు చెందిన 70 ఏళ్లు సాధువు జానకీదాస్‌ మహరాజ్‌ తన ఆరడుగుల గడ్డం సాయంతో నిండుగా ఉన్న రెండు గ్యాస్‌ సిలిండర్లను సునాయాసంగా పైకి ఎత్తగలుగుతున్నారు. మథుర బైపాస్‌ రహదారి సమీపంలోని హనుమాన్‌ ఆలయం వద్ద నివసించే జానకీదాస్‌ విన్యాసం చూసి భక్తులు ముక్కున వేలేసుకొంటున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఓ సన్నటి తువాలు సాయంతో మరో వ్యక్తి ఆయన గడ్డానికి ఈ సిలిండర్లను కడుతున్నారు. వాటిని చేత్తో తాకకుండా దాదాపు 56 కేజీల బరువును జానకీదాస్‌ ఇట్టే పైకి లేపుతున్నారు.