ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా వైఎస్సార్‌సీపీ కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అన్ని ప్రధాన నగరాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు జూమ్ ద్వారా ఆస్ట్రేలియాలోని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.