గత సంవత్సరంలో శ్రీలంక మహీంద్రా రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ ప్రజలు ప్రధానిపై తిరుగుబాటు చేయడంతో ఆర్ధికంగా శ్రీలంక అథఃపాతాళానికి పడిపోయిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలు ఆర్ధిక మరియు ఆహరం సంక్షోభంలో ఎంతటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో మాటల్లో చెప్పలేము. తాజాగా శ్రీలంక స్పీకర్ మహిందా అభివర్ధనే ప్రస్తుతం శ్రీలంక పరిస్థితులను మరియు గత సంవత్సరంలో ఎదుర్కొన్న పరిస్థితులను వివరించాడు. ఈయన మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ పుంజుకుని సాధారణంగా పాలన సాగిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం మా మిత్ర దేశం ఇండియా అని గర్వంగా చెప్పాడు. మేము కష్టంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దేశం కూడా మమ్మల్ని ఆదుకోలేదు.. ఒక్క ఇండియా మాత్రమే సరైన సమయంలో సాయం అందించి మమ్మల్ని నిలదొక్కుకోవడానికి ఊపిరిపోసింది అని ఎమోషనల్ గా చెప్పాడు అభివర్ధనే.ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ సమయంలో శ్రీలంకకు భారత్ ప్రభుత్వం దాదాపుగా 4 బిలియన్ డాలర్లు సహాయాన్ని చేసింది.