నిర్మాతకు దర్శకుడికి గాక తనకు వ్యక్తిగతంగా పాట నచ్చితేనే దాన్ని సంగీత దర్శకుడికి అందజేసే సిరివెన్నెల పాటను తన కన్నకూతురిగా భావించేవారని, కూతురిని ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేందుకు ఒక తండ్రి పడే తపన ఆయనలో నిరంతరం ప్రవహించేదని వక్తలు అన్నారు. తానా 2023 సభల్లో శనివారం నాడు తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డా. తోటకూర ప్రసాద్ సమన్వయంలో సిరివెన్నెలకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని ఆయన రచనలను విశ్లేషించారు. అనంతరం సినిమాయేతర రచనల సంపుటాలను విడుదల చేశారు.
పాటను కన్నకూతురిగా ప్రేమించిన సిరివెన్నెల
Related tags :