NRI-NRT

aeroplane: టేకాఫ్ కష్టం కావడంతో 19 మంది ప్రయాణికులను కిందకు దించారు!

aeroplane: టేకాఫ్ కష్టం కావడంతో 19 మంది ప్రయాణికులను కిందకు దించారు!

సాధారణంగా లాగేజ్ బరువు, ఇంధన బరువు, ప్రయాణికుల సగలు వెయిట్ చూసుకుని, అన్నీ పక్కాగా లెక్కలు కుదిరిన తర్వాతే విమానాలు టేకాఫ్ అవుతుంటాయి. ఇదంతా ప్రయాణానికి ముందు పైలట్లు ఖచ్చితంగా అనుసరించే విధానం. అయితే యూకేకు చెందిన ఓ ఎయిర్ లైనర్ కి చెందిన విమాన పైలట్లు చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం యూకేకి చెందిన ఈజీ జెట్ విమానం స్పెయిన్ లోని లాంజరోట్ నుంచి యూకే లివర్ పూల్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సమయంలో పైలట్ చేసిన ప్రకటన మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటన జూలై 5న జరిగింది.విమానం చాలా బరువుగా ఉందని టేకాఫ్ చేయడం కుదరదని చెబుతూ.. 19 మంది ప్రయాణికులను విమానం నుంచి దిగాల్సిందిగా కోరారు. విమానం రాత్రి 9.45 గంటలకు బయలుదేరాల్సి ఉన్నా.. అధిక బరువుతో 11.30 గంటల వరకు స్పెయిన్ లోని లాంజరోట్ లోనే ఉంది. ఒక ప్రయాణికులు పైలట్ చేస్తున్న అనౌన్స్మెంట్ ని తన ఫోన్ లో రికార్డ్ చేశాడు. విమానం చాలా బరువుగా ఉందని.. లాంజరోట్ లో చిన్న రన్ వే ఉందని.. ప్రస్తుతం గాలులు కూడా అనుకూలంగా లేవని, లాంజరోట్ లోని వాతావరణ పరిస్థితుల అనుగుణంగా విమాన బరువు ఎక్కువగా ఉందని పైలట్ చెప్పడం వీడియోలో వినవచ్చు.

ఎయిర్ క్రాఫ్ట్ ఎగరడానికి మార్గం లేదని, ప్రయాణికుల భద్రతకు తమ సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. ఇప్పుడు విమానం టేకాఫ్ కావాలంటే బరువు తగ్గించడం ఒకటే మార్గం అని పైలట్ చెబుతాడు. 20 మంది ప్రయాణికులు ఈ రాత్రి లివర్ పూర్ లకు వెళ్లొద్దని, ప్రయాణాన్ని ఉపసంహరించుకున్నందుకు ఈజీ జెట్ల ఒక్కో ప్రయాణికడికి 500 యూరోల ప్రోత్సహకాలను కూడా ఇస్తుందని పైలట్ ప్రకటించాడు. చివరకు 19 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానాన్ని వదిలారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ లైన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.