Business

డాక్టర్ కు ఫీజుగా ఫేక్ నోటు-TNI నేటి వాణిజ్య వార్తలు

డాక్టర్ కు ఫీజుగా ఫేక్ నోటు-TNI నేటి వాణిజ్య వార్తలు

నేడు గ్యాస్ సిలిండర్ ధరలు 

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గ్యాస్ ధరలు కొద్ది నెలల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.హైదరాబాద్: రూ. 1,115,వరంగల్: రూ. 1,174,విశాఖపట్నం: రూ. 1,112 విజయవాడ: రూ. 1,118,గుంటూర్: 1,114.

డాక్టర్ కు ఫీజుగా ఫేక్ నోటు

ఓ డాక్టర్ కు వింత అనుభవం ఎదురైంది. వైద్యం కోసం వచ్చిన పేషంట్ ఫీజుగా రూ.500 ఫేక్ నోటును ఇచ్చాడు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న డాక్టర్ ఫన్నీ ట్వీట్ చేశారు. రెండు ముక్కలు అతికించి ఉన్న నోటును చూసి చాలా నవ్వుకున్నానని.. ఇది తనకో ఫన్నీ మెమొరీగా ఉండిపోతుందన్నారు. కాగా, ఈ నోటుపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండటం గమనార్హం. ఇలా జరిగినందుకు బాధపడాలా.. జాలిపడాలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు

జాక్ మాపై మరో 8200 కోట్ల ఫైన్

జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్‌ పై  ఈ భారీ  ఫైన్ ను వేయడానికి గల(Rs 8200 Crores Fine) కారణాలను చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (CSRC) వెల్లడించింది. కార్పొరేట్ గవర్నెన్స్ కు విఘాతం, వినియోగదారుల భద్రతకు భంగం, బ్యాంకింగ్ మరియు బీమా చెల్లింపుల్లో అవకతవకలు, మనీలాండరింగ్, ఫండ్ సేల్స్‌ సహా అనేక రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందు వల్లే ఫైన్ వేశామని ప్రకటించింది. తాము జోక్యం చేసుకొని ఆ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు మళ్ళీ యాంట్ గ్రూప్‌ లో జరగకుండా వ్యవస్థాగత సంస్కరణలు చేశామని వెల్లడించింది. దీనిపై స్పందించిన యాంట్ గ్రూప్.. “మేం చైనా ప్రభుత్వ చట్టాలకు కట్టుబడి ఉంటాం. లోపాలు సరిద్దుకుంటూ ముందుకుపోతాం.. సంస్థాగత పాలనను మరింత మెరుగుపరుస్తాం” అని తెలిపింది.

మంచి స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? 

దేశీయ విఫణిలో రోజురోజుకి కొత్త స్మార్ట్​ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే చాలా మంది కొంత తక్కువ ధర కలిగిన బెస్ట్ అండ్ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. భారతీయ మార్కెట్లో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద మొబైల్ కొనాలని చూస్తున్న వారు ఈ బెస్ట్ స్మార్ట్​ఫోన్స్​ చూడవచ్చు. ఇందులో రియల్​మీ, మోటోరోలా, పోకో బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి.

* వేల కోట్లు సంపాదించే పనిలో పడ్డ అదానీ 

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ నిధుల వేటలో పడింది. గ్రూప్‌లోని పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఫండ్స్‌ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ సంస్థలున్నాయి. మొత్తం రూ.33వేల కోట్లకుపైగా నిధులను సమీకరించే దిశగా ఈ మూడూ వెళ్తున్నాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) మార్గం ద్వారా రూ.12,300 కోట్ల సేకరణకు అదానీ గ్రీన్‌ ఎనర్జీ పోనున్నది. ఈ ప్రతిపాదిత ఫండింగ్‌కు ఆ కంపెనీ బోర్డు కూడా ఆమోదం తెలిపింది.

భారీగా పెరిగిన బంగారం ధర

మహిళలకు బిగ్ షాక్ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో, మహిళలు షాక్‌కు గురి అవుతున్నారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,150 ఉండగా, నేడు 400 పెరగడంతో,54,550గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న59,070 ఉండగా, నేడు 59,510గా ఉంది.

ఇండ్ల అమ్మకాల్లో ఈ నగరమే టాప్

ఇండ్ల అమ్మకాల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి-జూన్‌ కాలంలో గతంతో పోల్చితే అమ్మకాలు 24 శాతం పెరిగినట్టు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ తెలిపింది. తాజా వివరాల ప్రకారం నిరుడు జనవరి-జూన్‌లో హైదరాబాద్‌లో హౌజింగ్‌ సేల్స్‌ 14,460 యూనిట్లుగా ఉంటే.. ఈ జనవరి-జూన్‌లో 17,890కి పెరిగాయి. మిగతా నగరాల విషయానికొస్తే.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 26 శాతం విక్రయాలు పడిపోయాయి. నిరుడుతో చూస్తే 9,530 యూనిట్ల నుంచి 7,040 యూనిట్లకు పరిమితమయ్యాయి. బెంగళూరులోనూ 11 శాతం దిగజారుతూ 16,020 యూనిట్ల నుంచి 14,210 యూనిట్లకు వచ్చాయి.ఇక కోల్‌కతాలో 31 శాతం క్షీణించాయి. 6,080 యూనిట్ల నుంచి 4,170 యూనిట్లకు దిగజారాయి. చెన్నైలో స్వల్పంగా 2 శాతం వృద్ధి కనిపించింది. అయితే ముంబై, పుణెల్లో సేల్స్‌ బాగా పెరిగాయి. ముంబైలో 62,630 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు 49,510 యూనిట్లే. అలాగే పుణెలోనూ 30,030 యూనిట్ల నుంచి 37,760 యూనిట్లకు చేరాయి. అహ్మదాబాద్‌లో 23 శాతం వృద్ధితో 12,790 యూనిట్ల నుంచి 15,710 యూనిట్లకు పెరిగాయి. అయినప్పటికీ మొత్తంగా దేశంలోని 8 నగరాల్లో ఇండ్ల అమ్మకాలపరంగా హైదరాబాద్‌ నగరమే టాప్‌లో నిలిచింది. ఇక ఈ 8 నగరాల్లో నిరుడు జనవరి-జూన్‌లో జరిగిన ఇండ్ల అమ్మకాలు 1,44,950 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం 15 శాతం వృద్ధితో 1,66,090 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్‌ తెలిపింది.

* ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరిగేవి కానీ, కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.హైదరాబాద్ :లీటర్ పెట్రోల్ ధర రూ.109, లీటర్ డీజిల్ ధర రూ.97. విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర రూ.110, లీటర్ డీజిల్ ధర రూ.99.

భారీగా తగ్గిన టమోటా ధర

టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కేజీ 150-200 వరకు పలుకుతుండగా.. టమాటా అత్యధికంగా పండే తమిళనాడులో ధరలు తగ్గాయి. చెన్నై కోయంబేడు మార్కెట్లో కేజీ {80కి చేరింది. కర్ణాటక చిక్ బళ్లాపూర్ మార్కెట్లోనూ క్వింటాలు ఔ6,660 పలకగా.. కొన్ని వారాల్లోనే ధరలు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. అటు మదనపల్లిలో టమాటా ఉత్పత్తి 2 వారాలుగా పెరగ్గా.. ఈ పంట మార్కెట్కు వస్తే, ధరలు ఇంకా తగ్గే ఛాన్సుంది.