WorldWonders

నిమిషాల్లో గాలిని శుభ్రపరిచే రోబో

నిమిషాల్లో గాలిని శుభ్రపరిచే రోబో

‘కరోనా’ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌ ప్యూరిఫైయర్ల వినియోగం పెరిగింది. సాధారణ ఎయిర్‌ ప్యూరిఫైయర్లను గదిలో ఎక్కడో ఒకచోట ఫ్యాన్‌ను పెట్టుకున్నట్లే పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి వాటి సామర్థ్యాన్ని బట్టి గదిలోని గాలిని శుభ్రపరుస్తాయి. కొరియన్‌ డిజైనర్‌ సాంగ్‌ ఇల్‌ సిన్‌ తాజాగా ‘ప్లాని’ పేరుతో రోబో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను రూపొందించాడు. ఇది ఇల్లంతా కలియదిరుగుతూ గాలిలోని తేడాలను గుర్తించి, దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకమైన సెన్సార్లు ఏర్పాటు చేయడం వల్ల దీని దారికి మనుషులు, పెంపుడు జంతువులు అడ్డు వచ్చినా, తప్పుకుని ముందుకు సాగుతుంది. పొగ, దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు నిలిచి ఉండి, అక్కడి గాలిని నిమిషాల్లోనే పరిశుభ్రం చేస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది.